అమెరికాలో ఇండియా యువతి మిస్సింగ్

ఇండియన్ స్టూడెంట్స్ పై అమెరికాలో దాడులు, హత్యలు, కిడ్నాప్ లు ఇంకా తగ్గడం లేదు. కాలిఫోర్నియాలో 23 ఏళ్ల నితీషా కందుల మే 28 నుంచి కనబడట్లేదు.  కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోని శాన్ బెర్నార్డినో నుంచి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను మే 30న చివరిసారిగా లాస్ ఏంజిల్స్ లో చూసినట్లు పోలీసులు తెలిపారు. 

వారం రోజులుగా ఆమె కోసం పోలీసులు వెతుకున్నారు. అయినా యువతి గురించి ఏం తెలియలేదు. ఆమె ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు ప్రజల సహాయం కోరారు. నితీషా సమాచారం తెలిస్తే పోలీసులకు సంప్రదించాలని ప్రకటనలు వేయించారు. అమెరికాలో ఏప్రిల్, మార్చి నెలల్లో కూడా ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మిస్ అయి శవమై కనిపించారు.