ఇస్రో 2029లో చేపట్టనున్న శుక్రయాన్ మిషన్(శుక్రయాన్–1) లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1236 కోట్లను కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. శుక్ర గ్రహంపై ఇస్రో చేపట్టనున్న తొలి ప్రయోగం ఇది.
శుక్రగ్రహం ఉపరితలం, వాతావరణ మార్పులు, అయనోస్ఫియర్, దట్టమైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించడంతోపాటు గ్రహం భౌగోళిక కార్యకలాపాలను పరిశీలించడం.
పరిశోధన జరిపేందుకు శుక్రయాన్ మిషన్‌లో సింథటిక్ ఎపర్చర్ రాడార్(ఎస్ఏఆర్), ఆల్ట్రావైలెట్ ఇమేజింగ్ సిస్టమ్ తదితర అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను అమర్చుతారు.
లాంచ్ వెహికల్ మార్క్ 3(ఎల్ఎంవీ–3) రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
శుక్రయాన్ అనేది సంస్కృత పదం. శుక్ర అనే పదం శుక్ర గ్రహానికి సంబంధించింది. యాన అంటే సంవత్సరంలో క్రాఫ్ట్ లేదా వాహకనౌక అని అర్థం. అందుకనే శుక్రయాన్ అనే పేరు పెట్టారు.