- సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని 10 లక్షల ప్రభుత్వ స్కూల్స్‌లో బాలురకు 16 లక్షలు, బాలికలకు 17.5 లక్షల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించింది. అలాగే, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్‌లో బాలురకు 2.5 లక్షలు, బాలికలకు 2.9 లక్షల మరుగుదొడ్లు కట్టామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. గవర్నమెంట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 6– 12వ తరగతి విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పిటిషన్‌పై ఇటీవల స్పందించిన సుప్రీంకోర్టు.. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.