- నేడు గుకేశ్, లిరెన్ మధ్య 13వ రౌండ్ గేమ్
సింగపూర్: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కీలక పోరుకు సిద్ధమయ్యాడు. బుధవారం జరిగే 13వ రౌండ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. 12 రౌండ్లు ముగిసేసరికి డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, గుకేశ్ 6–6తో సమంగా ఉన్నారు.
11వ రౌండ్‌లో అద్భుత విజయంతో ఆధిక్యంలోకి వచ్చిన ఇండియన్ ప్లేయర్ 12వ రౌండ్‌లో అనూహ్యంగా తడబడ్డాడు. దీంతో తర్వాతి రెండు గేమ్‌ల్లో దూకుడుగా ఆడితేనే విజయం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆఖరి గేమ్‌లో తెల్లపావులతో ఆడటం లిరెన్‌కు కలిసొచ్చే అంశం. ఒకవేళ 14 రౌండ్లు ముగిసినా ఫలితం రాకపోతే తక్కువ టైమ్ వ్యవధితో టై బ్రేక్ గేమ్స్ నిర్వహిస్తారు.