Koneru Humpy: వరల్డ్‌ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత కోనేరు హంపి

Koneru Humpy: వరల్డ్‌ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేత కోనేరు హంపి

వరల్డ్‌ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత క్రీడాకారిణి, తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ నిలిచింది. న్యూయార్క్‌ వేదికగా  ఆదివారం (డిసెంబర్ 29) జరిగిన పోరులో హంపి.. ఇండోనేషియాకు చెందిన ఐరీన్‌ సుకందర్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది.

హంపి 2019లో జార్జియా వేదికగా జరిగిన ఇదే ఈవెంట్‌లో ఛాంపియన్‌‌గా నిలిచింది. తద్వారా చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించింది.

యువతలో స్ఫూర్తి నింపుతాయి: హంపి

ఈ విజయం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు హంపి తెలిపింది. ముందుగా గేమ్ టై-బ్రేక్‌గా మారి కఠినమైన రోజులా మారుతుందని భావించానని.. కానీ, అటువంటి అడ్డంకులేమీ లేకుండా విజయం సాధించడం గర్వంగా ఉందని పేర్కొంది. 

"భారత్‌కు ఇది మంచి సమయం అని నేను భావిస్తున్నా. ప్రపంచ ఛాంపియన్‌ గుకేష్ మా భారతీయుడే. ఇప్పుడు నేను ర్యాపిడ్ ఈవెంట్‌లో రెండవ ప్రపంచ టైటిల్‌ గెలిచాను. ఈ విజయాలు భారత యువతను ప్రేరేపిస్తాయని నేను అనుకుంటున్నాను.." అని హంపి చెప్పుకొచ్చింది.