అర్జున్‌‌‌‌కు యూఎస్‌‌‌‌ వీసా కష్టాలు..

అర్జున్‌‌‌‌కు యూఎస్‌‌‌‌ వీసా కష్టాలు..

న్యూఢిల్లీ : వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌ ముంగింట ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌కు వీసా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ టోర్నీ కోసం అమెరికా వెళ్లేందుకు తన వీసా క్లియర్‌‌ చేయాలని యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎంబసీకి అతను విజ్ఞప్తి చేశాడు. వీసా విషయంలో సాయం చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌‌‌‌‌‌‌‌. జైశంకర్‌‌‌‌‌‌‌‌, క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌‌‌‌‌‌‌‌ మాండవియాతో పాటు ఆలిండియా చెస్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌నూ కోరాడు. ‘గత వారం నేను వీసా స్టంపింగ్‌‌‌‌‌‌‌‌ కోసం నా పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాను. ఇంత వరకు తిరిగి ఇవ్వలేదు. ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ త్వరగా పూర్తయ్యేలా చేసి పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇప్పించాలని కోరుతున్నా.

వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌‌‌‌‌ టోర్నీ కోసం నేను న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ వెళ్లాల్సి ఉంది. ఈ విషయంలో ఎవరైనా సాయం చేయండి’ అని అర్జున్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ నెల 26 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నీలో 300 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. మాజీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌   కరువాన, నెపోమ్నియాచి, బోరిస్‌‌‌‌‌‌‌‌ గెల్ఫాండ్‌‌‌‌‌‌‌‌ కూడా బరిలో ఉన్నారు. ఈ ఏడాది సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన అర్జున్‌‌‌‌‌‌‌‌ 2800 ఎలో రేటింగ్‌‌‌‌‌‌‌‌ కూడా అందుకున్నాడు.