
న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. శనివారం విడుదలైన ఫిడే క్లాసికల్ రేటింగ్స్‌లో గుకేశ్ 2787 ఎలో రేటింగ్ మూడో ర్యాంక్ అందుకున్నాడు. మాగ్నస్ కార్ల్‌సన్ (2833), నకామురా (2802) టాప్–2 ర్యాంకుల్లో నిలిచారు. చాన్నాళ్ల పాటు ఇండియా టాప్ ర్యాంకర్‌గా నిలిచిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ 2777 రేటింగ్‌తో ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రజ్ఞానంద 2758 రేటింగ్‌తో ఎనిమిది స్థానానికి చేరుకున్నాడు. విమెన్స్‌లో కోనేరు హంపి (2528) ఆరో ర్యాంక్‌తో ఇండియా నుంచి టాప్–10లో నిలిచింది.