కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారి బాలుడు సహా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
అసలేం జరిగిందంటే.. కెనడాలో ని ఒంటారియో స్టేట్ లోని బోమన్‌విల్లేలో ఓ దొంగ లిక్కర్ షాపులో చోరీకి పాల్పడ్డాడు. స్థానికుల సమాచరంతొ ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను తన కారులో పారిపోయాడు. పోలీసులు ఆ డించారు. అయితే దొంగ రాంగ్ రూట్లో కారులో పారిపోతుండగా టొరంటాకు ఈస్ట్ లో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్ బీలోని హైవే401 లో భారతీయులు వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు భారత్ కు చెందిన వృద్ధ దంపతులు, వారి మూడు నెలల మనవడితో పాటు దొంగ కూడా చనిపోయారు. చనిపోయిన మూడు నెలలచిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వాళ్లను ఆస్పత్రికి తరలించారు. భారత్ కు చెందిన వృద్ధ దంపతులు తమ కూతురిని చూడటానికి కెనడాకు వచ్చారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.