- డ్రోన్ దాడిలో చనిపోయాడని మరో యువకుడి వెల్లడి
న్యూఢిల్లీ: రష్యాలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం పేరిట మోసపోయి పుతిన్ ఆర్మీలో చేరిన ఇండియన్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో గుజరాత్‌కు చెందిన హెమిల్ అశ్విన్‌భాయ్ మంగూకియా(23) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం మరో ఇండియన్ యువకుడు చేసిన వీడియో మెసేజ్‌ద్వారా వెల్లడైంది.
ఈ నెల 21న రష్యా బార్డర్‌లోని డొనెట్స్క్లో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ విషయాన్ని మన దేశం అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ఘటనపై విదేశాంగ శాఖ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు. కాగా, కొన్ని నివేదికల ప్రకారం.. రష్యా సైన్యం పోయినేడాది 100 మంది యువకులను కాంట్రాక్ట్ కింద నియమించుకున్నట్లు తెలిసింది. వీళ్లను సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల పేరిట ఆశచూపి, ఏజెంట్లు సైన్యంలో చేర్చారు.