మార్కులు తెచ్చే శాసనాలు

ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీటివ్ పరీక్షల్లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడిగే విధానంలోమార్పు వచ్చింది. రాజులు, యుద్ధా లు, సంఘటనలు, సమస్యలు కాకుం డా ప్రజల జీవన విధానంవైపు ప్రశ్నల సరళి మళ్లిం ది. మారిన ప్రశ్నల స్వభావాల ఫలితంగా, ప్రధానంగా భారత దేశ చరిత్ర అధ్యయనంలో ఈ కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వా లి. భారతీయ సమాజం

..సంస్కృతి

..వారసత్వం

..నాగరికతల పరిణామ క్రమం

..కళలు

..నిర్మాణాలు

..సాహిత్యం

..తొలి పురావస్తు ఆధారాలు

అనేక శాస్త్ర పరిశోధనల ఆధారంగా ప్రధానంగా ప్లానిటీసియస్ పరికల్పన సిద్ధాంత ప్రాతిపదికగాభూమి వయస్సు సుమారు 460 కోట్ల సంవత్సరాలుగా గుర్తించారు. మానవ పరిణామ క్రమంలో తొలి మానవ విస్తరణ 10లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆరంభమైనట్లుగా భావిస్తున్నారు .భారతదేశంలో లభ్యమైన పురావస్తు ఆధారాల ద్వారా 5లక్షల సంవత్సరాల క్రితం నుంచి మానవ సంచార ఆధారాలు గుర్తించబడ్డా యి. వీటిలో ప్రముఖమైనవి. మధ్యప్రదేశ్ భీమ్ ట్టా గుహ చిత్రాలు మధ్యప్రదేశ్ ఆరంఘర్ జంతువులను పచ్చిక రాజస్థా న్ ఓడోర్‌‌లో ని గుహ చిత్రాలు గుజరాత్ లఘ్రాజ్ గుహ చిత్రాలు జమ్ముకాశ్మీర్ బుర్జుహం చిత్రాలు బిహార్‌‌_బీర్బాల్ పూర్‌‌ చిత్రాలు జార్ఖండ్ చోట గపూర్ చిత్రాలు ఉత్తరప్రదేశ్ బె లాన్ చిత్రాలు గోదావరి పరివాహక ప్రాంతమైన ఉత్తర తెలంగాణలోని పాండవుల గుట్ట చిత్రాలు, దక్షిణ తెలంగాణలోని కృష్ణా నది తీర రేఖా గణిత రూపంలో ని చేపల చిత్రాలు తొలి మానవ ఆవాసాలను గుర్తింపజేస్తున్నవి.

తొలి భారతీయ జాతులు….

వాస్తవంగా భారతదేశ చరిత్ర అంచెలంచెలుగా నిర్మించబడినది. అనేక జాతులు అవసరాలకు అనుగుణంగా ఈ దేశానికి విచ్ఛేసి స్థిరపడ్డా రు. అనేక ఆంత్రోపాలజీస్ అధ్యయనాల ద్వారా ప్రస్తుత ప్రజలమూలాలు ఈ కింది జాతుల నుంచి ఉద్భవించినట్లుగా గుర్తిస్తున్నారు .నీగ్రిటోఆస్ట్రో లాయిడ్స్ మెడిటేరియన్స్ ఆర్యన్స్ మంగోలాయిడ్స్ అదేవిధంగా భారతీయ సమాజం అనేక పరిణామక్రమంలో భాగంగా నేటి ఉజ్వలమైన స్థితికి చేరింది. ఆహార సేకరణ దశ, ఆహార ఉత్పత్తి దశ, తొలి నదీలోయ స్థిర నివాసాలు – నాగరికతలు, జనపదాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, తొలి వ్యాపా ర కేంద్రాలు–వలస ప్రాంతాలు, యూరోపియన్ ఆక్రమణలు, బ్రిటీష్ ఇండియా, ప్రస్తుత రిపబ్లిక్ ఇండియాగా అనేక మార్పులకు లోనైంది.

చరిత్ర రచనకు తొలి సన్నాహాలు…..

వాస్తవంగా యూరోపియన్ నిర్ధా రించిన చరిత్ర నమూన రచనలు బ్రిటీష్ ఇండియాలోనే ఆరంభమైనవి. 1902లో లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో ఏర్పడిన పురావస్తు విభాగం, 1904లో విడుదలైన చారిత్రక కట్టడాల పరిరక్షణ చట్టం భారతీయ చారిత్రక రచనకు ప్రోత్సాహకాలు అందించిం ది. జేమ్స్ మిల్ రచించి విడుదల చేసిన ‘బ్రిటీష్ ఇండియా హిస్టరీ’ తొలి బ్రిటీష్ చరిత్రకారు ని భారతదేశ చరిత్రగా గుర్తించవచ్చు. జర్మనీ చరిత్ర రచయిత‘మాక్స్ ముల్లర్’ సంస్కృతాన్ని స్వయంగా నేర్చుకుని భారతీయ చారిత్రక సంస్కృత ఆధారాలను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పరిశోధకులను ఒకశైలిలో లేదా ఆధారాల ప్రాతిపదికగా చరిత్రను రాసే పద్ధతి హిస్టోరియోగ్రఫీ భారతదేశ చరిత్రను రికార్డు చేసే ప్రయత్నాలు ఆరంభించింది. ఈ నేపథ్యంలో అనేక భారతీయ రచనలు తిరిగి తేబడినవి. చరిత్ర అధ్యయనానికి భారతీయ చరిత్రకు సంబంధించిన గ్రంథాలు, వివిధ సందర్భాలలో ప్రస్తావించిన విదేశీ రచనలు, ప్రధానంగా విదేశీ యాత్రికుల రచనలు ఎక్కు వగా ఉపయోగపడుతున్నవి.వీరితోపాటుగా టావెర్నియర్, అబ్దు ల్ రజాక్,అథనేషియన్ నికెటన్, నికోలో కౌంటీ, డోమింగ్ సేజ్, న్యూవిజ్ మొదలైన వారి రచనలు భారతీయ చరిత్రను అవగతం చేసుకోవడానికి అవకాశం కల్పి స్తున్నాయి.

లిపి అనుసరణ క్రమం…..

భారతీయ చరిత్రలో లిపి మూడు రూపాల్లో గోచరిస్తుం ది. ఇందులో సింధూ నాగరికత లిపి నేటికీ ఆవిష్కరిం పబడలేదు. బ్రహ్మి లిపి ఎడమ నుంచి కుడికి ఉంటుం ది. దీనిని అశోక చక్రవర్తి విరివిరిగా వ్యాప్తిలో నికి తెచ్చాడు. భారతదేశమంతటా విస్తరింపజేశాడు. ‘జేమ్స్ ప్రిన్సెస్’ దీన్ని తిరిగి పరిశోధించి నవ్యత్వం ఆపాదించాడు. కరోస్థి లిపి కుడి నుంచి ఎడమకు ఉంటుం ది. ఇది పర్షియన్ భాష ప్రభావం నుంచి ఏర్పడినది. ప్రధానంగా మౌర్యుల కాలంలో ని అశోకుని శాసనాలు జీవన విధానానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించినవి ఉన్నాయి. ప్రధానంగా బౌద్ధ ధార్మిక విషయాలకు సంబంధించిన విస్తృ త ప్రాతిపదికను ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేశాయి.చరిత్ర అంశాలను అధ్యయనం చేస్తున్నపుడు కాలం వారీగా లేదా దశల వారీగా చరిత్రను వర్గీకరించు కోవాలి. చారిత్రక ఆధారాలను, పురావస్తు ఆధారాలను గుర్తించగలగాలి. గ్రంథాలు, సంస్కృతి అంశాలు, శాసనాలు, నిర్మాణాలను గుర్తించుకోవాలి. చరిత్రను అన్వేషణ దృష్టితో పరిశీలించి ఆసక్తిని కనబరిచినప్పుడు