న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ జర్మనీతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా హాకీ జట్టు ఆఖరి పోరులో గెలిచినా సిరీస్ దక్కలేదు. గురువారం జరిగిన రెండో టెస్ట్‌లో ఇండియా 5–3తో జర్మనీపై గెలవడంతో సిరీస్ 1–1తో సమమైంది. దీంతో సిరీస్ విన్నర్ కోసం షూటౌట్ నిర్వహించారు. ఇందులో ఇండియా 1–3తో జర్మనీ చేతిలో ఓడింది.
రెగ్యులర్ మ్యాచ్‌లో ఇండియా తరఫున సుక్‌జీత్ సింగ్ (34, 48వ ని), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (42, 43వ ని), అభిషేక్ (45వ ని) గోల్స్ చేయగా, లియాన్ మజ్కోర్ (7, 57వ ని), హెన్రిక్ మార్ట్‌జెన్స్ (60వ ని) జర్మనీకి గోల్స్ అందించారు. ఇక షూటౌట్‌లో ఇండియన్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్, అభిషేక్, మహ్మద్ రాహీల్ టార్గెట్ మిస్ చేయగా ఆదిత్య ఏకైక గోల్ కొట్టాడు. గోల్ కీపర్ క్రిష్ణ బహుదూర్ పాఠక్ రెండు గోల్స్‌ను అడ్డుకున్నా ఇండియా గట్టెక్కలేకపోయింది.