కాంస్యమైనా దక్కేనా?

కాంస్యమైనా దక్కేనా?

పారిస్‌‌‌‌: భారీ ఆశలతో బరిలోకి దిగి సెమీస్‌‌‌‌లో అనూహ్యంగా తడబడిన ఇండియా హాకీ జట్టు ఇప్పుడు కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే  ప్లే ఆఫ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ను ఓడించేందుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెడీ అయింది.

ఆరంభంలో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ జర్మనీని కట్టడి చేయడంలో బాగా సక్సెస్‌‌‌‌ అయిన ఇండియా రెండో, నాలుగో క్వార్టర్స్‌‌‌‌లో తడబడింది. 10 పెనాల్టీ కార్నర్లలో రెండింటినే గోల్స్‌‌‌‌గా మలిచింది. కాంస్య పోరులో ఇండియా ఈ విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. నెదర్లాండ్స్‌‌‌‌తో జరిగిన సెమీస్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ ఒక్క గోల్‌‌‌‌ కూడా కొట్టలేకపోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ అనొచ్చు.