గదిలో భార్య శవం.. నదిలో భర్త శవం.. యూఎస్ లో ఇండియన్ దంపతుల మృతి

గదిలో భార్య శవం.. నదిలో భర్త శవం..  యూఎస్ లో ఇండియన్ దంపతుల మృతి

న్యూజెర్సీలో ఇండియన్ దంపతులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఐదు నెలల గర్భవతి అయిన భార్యను చంపి.. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గరీమా కొఠారీ మరియు మన్మోహన్ మాల్ భార్యభర్తలు. గరీమా వారుంటున్న అపార్ట్‌మెంట్‌లోనే హత్యకు గురైందని.. ఆమె భర్త మన్మోహన్ వారింటికి సమీపంలో ఉన్న హడ్సన్ నదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని సమాచారం. గరీమా కొఠారీ మృతదేహాన్ని ఏప్రిల్ 26న న్యూజెర్సీ సిటీ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం ద్వారా.. కొఠారీని ఎవరో హత్య చేశారని, ఆమె శరీరంలో పలు గాయాలున్నాయని మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు. అంతేకాకుండా కొఠారీ ప్రస్తుతం 5 నెలల గర్భవతి అని తెలిపారు. కొఠారీ గాయాల వల్లే చనిపోయిందని హడ్సన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

కాగా.. కొఠారీ భర్త మన్మోహన్ మాల్ (37) న్యూజెర్సీ సిటీలోని హడ్సన్ నదిలో దూకి చనిపోయాడు. అతడు మోంట్‌గోమేరీ స్ట్రీట్ మరియు ఎక్స్ఛేంజ్ ప్లేస్ సమీపంలో హడ్సన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు న్యూజెర్సీ సిటీ పోలీస్ అధికారులు తెలిపారు. అతని పోస్టుమార్టం వివరాలు ఇంకా రాలేదని తెలిపారు. మన్మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని వారు అన్నారు.

న్యూజెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ప్రాసిక్యూటర్ ఆఫీస్ హోమిసైడ్ యూనిట్ ఈ కేసును విచారిస్తోంది. వీరిద్దరూ హత్య మరియు ఆత్మహత్యల వల్లే చనిపోయారని ప్రాథమికంగా తెలిసినా.. శవ పరీక్షల అనంతరం కన్ఫర్మ్ చేస్తామని పోలీసులు తెలిపారు.

గరీమా కొఠారీ మంచి చెఫ్ మరియు ఆమె భర్త మన్మోహన్ కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. అతను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) యొక్క పూర్వ విద్యార్థి. వీరిద్దరూ తమ
అపార్ట్‌మెంట్‌ కు కొంతదూరంలోనే ‘నుక్కాడ్’ అనే భారతీయ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. కొఠారీ మరియు మన్మోహన్ చాలా మంచి జంట అని నుక్కాడ్ పనిచేసే ఉద్యోగి అన్నారు.

వీరి మృతి పట్ల వారి కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. ‘మన్మోహన్ చాలా తెలివైన వ్యక్తి మరియు కొఠారీ చాలా మంచి చెఫ్. వారిద్దరూ చాలా కలుపుగోలుగా ఉండేవాళ్లు’ అని అన్నారు.

For More News..

కరోనా కట్టడికి 3 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా 

చికెన్ రేటు ఎక్కువ చెప్పాడని.. పొడిచి చంపిన అన్నదమ్ములు

పోలీసులు లాక్డౌన్ డ్యూటీలో.. దొంగలు తమ పనిలో..

మందుకోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని 19 ఏళ్ల కొడుకుని..

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ