iPhone News: ఆపిల్‌కి అండగా ఇండియా.. రాత్రికి రాత్రే రూ.16వేల కోట్ల విలువైన ఐఫోన్స్ అమెరికాకు

iPhone News: ఆపిల్‌కి అండగా ఇండియా.. రాత్రికి రాత్రే రూ.16వేల కోట్ల విలువైన ఐఫోన్స్ అమెరికాకు

Apple News: అనేక దశాబ్ధాలుగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్లు, ఐపాడ్స్, ఇయర్ బడ్స్ సహా మరిన్ని ఆపిల్ ఉత్పత్తులను అమెరికా బయట ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో ఒకప్పుడు చైనా, తైవాన్ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన ఉత్పత్తిని కంపెనీ ఇండియాకు విస్తరించిన సంగతి తెలిసిందే.

ఆపిల్ ఉత్పత్తులను ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్న సప్లయర్స్ ఫాక్స్‌కాన్, టాటా గ్రూప్. ఇటీవలి కాలంలో ఫాక్స్‌కాన్ ఉత్తర్‌ప్రదేశ్ కేంద్రంగా మరో ప్లాంట్ ఏర్పాటుకు యోగి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడైంది. అయితే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై టారిఫ్స్ ప్రకటించటంతో ఆపిల్ తన భారత ఉత్పత్తిని మార్చి నెలలో వేగవంతం చేసిందని వెల్లడైంది. ఈ క్రమంలో టెక్ జెయింట్ ఇండియా నుంచి 600 టన్నుల బరువైన ఐఫోన్లను కొద్దిరోజుల్లోనే అమెరికాకు విమానాల్లో తరలించటం గమనార్హం. దీంతో మార్చి నెలలో రూ.16వేల కోట్లు విలువైన ఆపిల్ ఉత్పత్తులను ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేయటం జరిగింది.

ముందుగా  ఫాక్స్‌కాన్ రూ.10వేల 500 కోట్లు విలువైన ఉత్పత్తులను మార్చి నెలలో అమెరికాకు ఎగుమతి చేయగా.. టాటా గ్రూప్ దాదాపు రూ.4వేల 900 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులను సరఫరా చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఇందులో ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 16, ఐఫోన్ 16ఇ మోడళ్లను సరఫరా చేయటం జరిగింది. ఇక టాటా ఎలక్ట్రానిక్స్ ఫిబ్రవరిలో కంటే 63 శాతం ఎక్కువ విలువైన ఎగుమతులను చేపట్టదగా వాటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లు ఉన్నాయని వెల్లడైంది. 

Also Read:-ఐ ఫోన్లను ఎగబడి కొంటున్న ఇండియన్స్.. 3 నెలల్లో 30 లక్షల సేల్స్ తో రికార్డ్ బద్దలు

ఈ క్రమంలో ఫాక్స్‌కాన్ చెన్నై ఎయిర్ కార్గో టర్మినల్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, చికాగో వంటి రాష్ట్రాలకు తరలిచిందని వెల్లడైంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థ తక్కువ సమయం కారణంగా కస్టమ్స్ అనుమతులను 30 గంటల నుంచి 6 గంటలకు తగ్గించేందుకు రిక్వెస్ట్ చేసి వాటిని వేగంగా తరలించిందని వెల్లడైంది. ఇందుకోసం ఏకంగా 6 కార్గో జెట్స్ వినియోగించినట్లు తేలింది. వాస్తవానికి చైనాపై అమెరికా 145 శాతం సుంకాలను విధించగా.. అవి భారతదేశంపై విధించిన సుంకం కంటే చాలా ఎక్కువ కావటంతో ఆపిల్ వ్యూహాత్మకంగా భారీగా స్టాక్ అమెరికాకు తరలించిందని వెల్లడైంది. ప్రస్తుతం ఇండియాపై టారిఫ్స్ హోల్డ్ చేసినందున పరిస్థితులు కొంత స్థిమితపడ్డాయి.

ఇదే క్రమంలో ఆపిల్ సంస్థ రానున్న నాలుగేళ్లలో అమెరికాలో రూ.40 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు. అయితే అమెరికాలో ఆపిల్ ఫోన్లను తయారు చేస్తే వాటి ధర ప్రస్తుతం ఉన్నదానికంటే మూడు రెట్లుగా మారుతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ విక్రయ ధరలు అమెరికాలో తక్కువగా ఉండగా యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ఉంది. 80 శాతం చైనాలో ఉత్పత్తిని నిర్వహిస్తున్నందునే తక్కువ ధరలకు లేబర్ దొరుకున్నందున ఆపిల్ ఈ రేట్లకు అమ్మగలుగుతోందని వెల్లడైంది. అయితే భవిష్యత్తులో ఆపిల్ అందరి ద్రాక్షలా మారొచ్చనే ఆందోళనలు ట్రంప్ తీరువల్ల చాలా మందిలో కలుగుతున్నాయి.