ఇండియన్ ఐటీ సెక్టార్ అభివృద్దిపథంలో దూసుకుపోతోంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో భారతీయ IT ఇండస్ట్రీ మరింత వృద్ధి సాధించనుంది. దీం తో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2025లో కొత్త ఉద్యోగాలు 20శాతం పెరిగే అవకాశం ఉందని హ్యూమన్ రీసోర్స్ ప్లాట్ఫాం ఫస్ట్ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ చెబుతోంది.
2024లో భారతీయ ఐటీ పరిశ్రమలో కొత్తగా 17 శాతం ఉద్యోగాలు కల్పించబడ్డాయి. వేగవంతమైన డిజిటల్ట్రాన్స్ ఫార్మింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. అయితే 2024 మొదటి అర్థభాగంలో ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ తర్వాతి భాగంలో కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.ఇది 2025లో కూడా కొనసాగించేందుకు ఐటీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.
అప్లికేషన్ డెవలపర్స్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు,DevOps ఇంజనీర్లు, AI , ML వంటి పోజిషన్లలో దాదాపు 20 శాతం ఉద్యోగాలు కల్పించబడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా 2024లో ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) 2025మరింత వేగవంతం కానుంది. డేటా ఎనలిస్టులు, డేటా ఇంజనీర్లు, డేటా సైంటి స్టులు వంటి పోస్టులకు మంచి డిమాండ్ ఉండనుంది.
2028నాటికి GenAI సెక్టార్లో 10లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది స్థూల జాతియోత్పత్తిపై కీలక ప్రభావం చూపుతుందని అంటున్నారు.2025లో జనరేటివ్ AI ఇంజనీర్లు, అల్గారిథమ్, AI సెక్యూరిటీ స్పెషలిస్ట్ లకు 25నుంచి 30 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉంది.
వ్యాపార విస్తరణ, కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నపుడు నియామకాలు పెరుగుతాయి.డిజిటల్ సదుపాయాలు మెరుగుపడతాయి. టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ మద్దతునిస్తుంది. 2018నుంచి 2024 మధ్యకాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వంటి ఇండస్ట్రీస్ రావడంతో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
మరోవైపు 2030 నాటికి ఐటీ సెక్టార్లో 2.5 నుంచి 25లక్షల నుంచి 28 లక్షల ఉద్యోగాల కల్పన జరగొచ్చని అంచనా.వీటితోపాటు BFSI, టెలికం వంటి నాన్ టెక్సెక్టార్లు కూడా ఐటీ, టెక్నిపుణులను పెంచుకునే అవకాశం ఉంది.