సంగ్రామానికి ఆనవాళ్లు.. అలనాటి జైళ్లు

దేశంలో తెల్లోళ్ల పాలనకు తెరపడి ఇవాళ్టికి 72 ఏళ్లు.  దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు  తమ జీవితాలను పణంగా పెట్టారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. పోరుబాట పట్టినోళ్లను బ్రిటిష్​ సర్కారు వివిధ జైళ్లలోకి నెట్టింది. ఆ చెరసాలలు చిత్రహింసలకు చీకటి కేంద్రాలుగా ఉండేవి.

కాలాపానీ​ జైలు​:

ఆసియాలోని అతిపెద్ద జైళ్లలో ఇదొకటి. అండమాన్​–నికోబార్​ దీవుల క్యాపిటల్​ సిటీ(పోర్ట్​ బ్లెయిర్)​లో ఉంది. బ్రిటిష్​ ప్రభుత్వం​ 1896–1906లో కట్టించింది. దీన్నే సెల్యులర్​ జైలు అని, బ్లాక్​ వాటర్​ జైలు అని కూడా అంటారు. దీని చుట్టూ సముద్రం ఉండటంతో కాలాపానీ జైలు అని కూడా అంటారు. నాలుగు వైపులా పెద్దఎత్తున నీళ్లు ఉండటంతో ఖైదీలెవరూ ఇక్కడి నుంచి పారిపోరు. ఈ జైలు బాగా మారుమూల ప్రాంతంలో  ఉండటంతో ఆ రోజుల్లో రాజకీయ ఖైదీలను బంధించటానికి ఎక్కువగా ఉపయోగించేవారు.  వీర్​ సావర్కర్​, బతుకేశ్వర్​ దత్​ వంటి​ ఎందరో ఫ్రీడం ఫైటర్లు ఇక్కడ శిక్ష అనుభవించారు. ఘోరమైన శిక్షలకు ఈ జైలు కేంద్రంగా ఉండేది.  ఖైదీలు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు ఉండేవి కావు. అప్పటి కాలాపానీ జైలు ఇప్పుడు నేషనల్​ మాన్యుమెంట్ గా పాపులర్​ అయింది.

మద్రాస్​ సెంట్రల్​ జైలు:

దేశంలోని ఓల్డెస్ట్​ జైలు ఏదంటే ఇదేనని చెప్పొచ్చు. దీన్ని 2009లో కూల్చేశారు. కాలాపానీ జైలుకు తరలించే ఖైదీలను మార్గమధ్యంలో కొద్ది రోజుల పాటు ఉంచటానికి ఈ జైలును కట్టించినట్లు భావిస్తున్నారు. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​, వీర్​ సావర్కర్​ వంటి గ్రేట్​ ఫ్రీడం ఫైటర్లను ఈ జైల్లోనే ఉంచారు. ఈ జైలు ఆవరణలోని కొన్ని భవనాలను ఆ మధ్య పడకొట్టి తర్వాత మళ్లీ నిర్మించారు.

యరవాడ జైలు:

మన దేశంలో సెక్యూరిటీ ఎక్కువగా ఉండే జైలు ఇది. మహారాష్ట్రలోనే కాదు. సౌతేసియాలోనే అతి పెద్ద జైలు కూడా ఇదే. దీన్ని బ్రిటిషర్లు 1871లో కట్టించారు. 1930, 40ల్లో ఇండిపెండెన్స్​ మూమెంట్​ ఉధృతంగా సాగింది. స్వాతంత్ర్యోద్యమంలో  పాల్గొన్నందుకు  మహాత్మాగాంధీని ఈ జైల్లోనే ఉంచారు. దీంతో స్వాతంత్ర్య పోరాట ​ సమయంలో దేశంలో ప్రముఖంగా వార్తల్లోకెక్కిన జైళ్లలో ఇదీ ఒకటి.  ఇక్కడ టెక్స్​టైల్​ మిల్లుతోపాటు ప్రత్యేకం​గా రేడియా స్టేషన్​ ఉంది. ​  ఖైదీల కోసం రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేశారు ఇక్కడి ఓపెన్​ ఎయిర్​ జైల్లో సెక్యూరిటీ మరీ కట్టుదిట్టంగా కాకుండా కాస్త మామూలుగానే ఉంటుంది. ఖైదీలు కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుతుంటారు. ప్రస్తుతం ఇక్కడి ఖైదీలకు బాపూజీ జీవన విధానాలను, ఆయన  పాటించిన అహింసా సూత్రాలను నిత్యం బోధిస్తుంటారు. ఆసక్తి కలిగినవారు వాటిని నేర్చుకోవచ్చు. అనుసరించొచ్చు.

గాలోస్​ ఆఫ్​ వైపర్​ ఐలాండ్​ : 

ఈ జైలు సెల్యులర్​ జైలంత ఫేమస్​ కాదు. కానీ.. ఇండియన్​ ఫ్రీడం స్ట్రగుల్​ను  అణచివేయటానికి సెల్యులర్ జైలును ఏవిధంగా అయితే వాడుకున్నారో గాలోస్​ ఆఫ్​ వైపర్​ ఐలాండ్​నీ అలాగే ఉపయోగించుకున్నారు. సెల్యులర్​ జైలు కన్నా దీన్నే కొన్నేళ్ల ముందు నిర్మించారు. బ్రిటిష్​ వారికి  వ్యతిరేకంగా మాట్లాడినోళ్లను ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ భవనాలు చాలా వరకు పాడుబడ్డాయి. వైపర్​ ఐలాండ్​, పోర్ట్​ బ్లెయిర్​కి పడమర దిక్కున  4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రాజమండ్రి సెంట్రల్​ జైలు:

ఆంధ్రప్రదేశ్​లోని ఈ జైలును డచ్​ పాలకులు 1602లో ఒక కోట మాదిరిగా కట్టారు. తర్వాత 1864లో జైలులా మార్చారు. జైలు మొత్తం 196 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. బ్రిటిష్ కాలంలో మన దేశ ప్రజలు, ఫ్రీడం ఫైటర్లు చూసిన నరకానికి ఈ జైలే ప్రత్యక్ష సాక్షి. ఇప్పటికీ చాలా మంది.. ‘కరుడుగట్టిన క్రిమినల్స్​ను రాజమండ్రి సెంటల్​ జైలుకు పంపించాలి’ అంటుంటారు. దీన్నిబట్టి అక్కడ శిక్షలు ఏ రేంజ్​లో ఉంటాయో చెప్పొచ్చు. ప్రస్తుతం.. ఖైదీలకు చదువు నేర్పించటంలో ఈ జైలు పెట్టింది పేరు. ఖైదీల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​ కోసం జైలు ఆవరణలోని క్లాస్​ రూమ్​ల్లో పలు కోర్సులు బోధిస్తున్నారు. నిందితులను, నేరస్తులను వివిధ ప్రొడక్టివ్ యాక్టివిటీస్​లో ఉత్సాహంగా పాలుపంచుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఒకప్పుడు మానవ హక్కుల అణచివేతకు కేంద్రంగా నిలిచిన ఈ ప్రదేశం ఇప్పుడు క్రిమినల్స్​ రిక్రియేషన్​కు కేరాఫ్​ అడ్రస్​గా మారింది.