వరల్డ్ కప్ కి టీమిండియా జెర్సీ అదరహో ..ఆకట్టుకుంటున్న థీమ్ సాంగ్

భారత్ వేదికగా 12 సంవత్సరాలను తర్వాత వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరో రెండు వారాల తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా భారత జట్టు వరల్డ్ కప్ లో ధరించే కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. 

కొత్త జెర్సీ, థీమ్ సాంగ్ తో.. 

ఎప్పటిలాగే టీమిండియా వరల్డ్ కప్ కి ధరించే కొత్త జెర్సీ వచ్చేసింది. నీలి రంగులో ఉన్న ఈ జెర్సీని బాగా తీర్చిదిద్దారు. ఇక ఈ జెర్సీని ఆవిష్కరిస్తూ.. ఒక థీమ్ సాంగ్ ని కూడా విడుదల చేశారు. భారతదేశ కిట్ భాగస్వాములైన అడిడాస్, భారత క్రికెట్ జట్టు కోసం ఒక గీతాన్ని రూపొందించారు. బీసీసీఐ ఈ గీతాన్నితాజాగా ట్విట్టర్లో విడుదల చేసింది. "ఇంపాజిబుల్ నహీ యే సప్నా, 3 కా డ్రీమ్ హై అప్నా" అని పిలువబడే 2 నిమిషాల 21-సెకన్ల గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులని ఆకట్టుకుంటుంది. 

ALSO READ :  బాపూజీ స్ఫూర్తితో ..హక్కులు కోసం కొట్లాడుదాం

ఈ థీమ్ సాంగ్ లో భారత్ మూడవసారి ప్రపంచ కప్ గెలవాలనే తపన కనబడుతుంది. 1983,2011 లో వరల్డ్ కప్ గెలిచిన భారత్ ఈ సారి కూడా కప్ కొట్టాలని ఈ సాంగ్ చెబుతుంది. ఇక ఇటీవలే ఈ ఎడిషన్ ప్రపంచకప్ గీతాన్ని ఐసీసీ బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.