సువా (ఫిజి) : ఇండియా వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ బాబు.. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. గురువారం జరిగిన మెన్స్ 81 కేజీల్లో అజయ బాబు 326 కేజీ (147+179)ల బరువు ఎత్తి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. తద్వారా క్లీన్ అండ్ జర్క్‌లో కామన్వెల్త్ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు... స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, టోటల్ వెయిట్‌లో జూనియర్ నేషనల్ రికార్డులను బద్దలుకొట్టాడు.
సాయిరాజ్ ప్రదేశి 299 కేజీలు (164+135) బరువు ఎత్తి సిల్వర్‌ను సాధించాడు. యూత్ కేటగిరీలో సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. మెన్స్ 89 కేజీల్లో లాల్రుఅట్ఫెలా 301 కేజీ (135+166)ల బరువు ఎత్తి రజత పతకం సాధించాడు. యూత్ కేటగిరీలో హృదానంద దాస్ 299 కేజీలు (129+170) లిఫ్ట్ చేసి రెండో ప్లేస్‌తో సిల్వర్ నెగ్గాడు. జూనియర్ సెక్షన్‌లో బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నాడు.