కుంభమేళాలో సంచలనాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ పూసలమ్మాయి ఫేమస్ కాగా... ఇప్పుడు కుంభమేళా గ్రీకు యువతికి.. యూపీ యువకుడికి పెళ్లి వేదిక అయింది. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఒక భారతీయ వ్యక్తి తన గ్రీకు ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట మతపరమైన ఉత్సవంలో వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
సాంప్రదాయ వైదిక వేడుకలో పెనెలోప్‌తో ( గ్రీకు యువతి) .. సిద్ధార్థ్ ( యూపీ యువకుడు) పెళ్లి చేసుకున్నారు. జునా అఖారాలోని మహామండలేశ్వర స్వామి యతీంద్రానంద గిరి వధువు కుటుంబ సమేతంగా కన్యాదానం చేశారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట తాము ఒక సాధారణమైన కానీ దైవికమైన వేడుకను చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు . పెనెలోప్‌కు గ్రీస్ లేదా ఇండియాలో పెళ్లి చేసుకునే అవకాశం కల్పించినట్లు సిద్దార్థ్ తెలిపాడు. పెళ్లి వేదికగా ఆమె భారత్‌ను ఎంచుకుందని సిద్దార్ధ్ అన్నారు.
ALSO READ | ఇన్ఫోసిస్ కో ఫాండర్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు
వివాహం అయిన తరువాత మహారాజ్ జీ (స్వామి యతీంద్రానంద గిరి)ని కలిసి.. అతని ఆశీర్వాదాలను తీసుకున్నారు. పెళ్లి అనేది ఒకపురుషుడు.. ఒక స్త్రీని కలిపే పవిత్ర కార్యక్రమమని సిద్దార్థ్ అన్నాడు. గ్రీకు యువతి.. వధువు .. పెనెలోప్ మాట్లాడుతూ తాను ఇంతకు ముందు భారతదేశంలో జరిగే వివాహానికి హాజరు కాలేదని తెలిపింది. తాను పెళ్లి చేసుకునే సమయంలో కొంత దైవిక శక్తి గ్రహించినట్లు తెలిపింది.
కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక వేడుకల్లో పెళ్లి చేసుకోవడం చాలా అద్భుతమన్న పెనెలోప్ బౌద్ధమతం నుండి హిందూ మతంలోకి మారినట్లు తెలిపింది. జనవరి 29న గంగా నదిలో పవిత్ర జలంలో పుణ్యస్నానం ఆచరిస్తానని తెలిపింది.