
ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు గత మూడేళ్లుగా లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన డయానాతో ప్రేమలో పడ్డాడు. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు.. స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. వివిధ కారణాల వల్ల లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో.. బెల్లంపల్లికి చెందిన ముత్తె వెంకటేశ్, లావణ్య దంపతులు కన్యాదానం చేశారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగగా పెళ్లికి వచ్చిన అతిధులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.