న్యూయార్క్ లో ఫైర్ యాక్సిడెంట్..భారతీయ యువకుడి మృతి

అమెరికాలో వరుస ప్రమాదాల్లో భారతీయుడు మృతి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల దాడులు, ప్రమాదాల్లో భారతీయులు మృతిచెందగా..శుక్రవారం మరో భారతీయ యువకుడు ఫైర్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. న్యూయార్క్ లోని హార్లెన్లో శుక్రవారం (ఫిబ్రవరి 23) ఓ అపార్ట్ మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫాజిల్ ఖాన్ అనే భారతీయ యువకుడు మృతిచెందాడు.  సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్ మెంట్ భవనంలోని నివాసితులు  భారీ ఎత్తున ఎగిసి పడుతున్న మంటల నుంచి తప్పించుకునేందుకు కిటికీల నుంచి కిందకు దూకడంతో 17 మందికి గాయాలయ్యాయి.ఈ-బైక్ లోని లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడుతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియాలో ప్రచురించింది. 

అపార్ట్ మెంట్  లోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఆ సయమంలో భవనంలో ఉన్న ఫాజిల్ ఖాన్ మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలపాలైన ట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫాజిల్ ఖాన్ మృతి చెందినట్లు డైలీ న్యూస్ పేర్కొంది. 

మృతిచెందిన సాఫిల్ ఖాన్..కొలంబియా జర్నలిజం స్కూ్ ల్ గ్రాడ్యుయేట్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఖాన్ కుటుంబానికి ఈ విషయం తెలియజేశారు. ఫాజిల్ ఖాన్ మృతదేహాన్ని భారత్ కు చేర్చేందుకు సాయం అందిస్తామని ట్విట్టర్లో చెప్పారు.