ఆస్ట్రేలియాలో భారత ప్రేమ పక్షులు.. మోకాలిపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్

ఆస్ట్రేలియాలో భారత ప్రేమ పక్షులు.. మోకాలిపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్

కాళ్ల వేళ్లా పడి ప్రియురాలిని స్టేడియానికి తీసుకురావటం.. నలుగురి ముందు ఆమెకు ప్రపోజ్ చేయటం.. ఈ ట్రెండ్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఒకరిని చూసి మరొకరు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలానే ఎందుకంటారా! చుట్టూ జనం ఉంటే మరో మాట ఎదురు చెప్పకుండ ఒప్పుకుంటుందనే నమ్మకంతో. తాజాగా, ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ భారత ప్రేమ జంట అలానే దగ్గరైంది.

మంగళవారం(జనవరి 2) మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ వీక్షించటానికి ఓ భారత ప్రేమ జంట హాజరైంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో యాంకర్ ప్రేక్షకుల మధ్య తిరుగుతూ వారి అనుభూతులు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ప్రియురాలికి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. మొదట ఆశ్చర్యపోయిన ఆమె.. ఆ తరువాత అతని ప్రేమను అంగీకరించింది. దీంతో అతడు ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మ్యాక్స్ వెల్ వన్ మ్యాన్ షో.. 

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు మ్యాచ్ కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన  రెనెగేడ్స్ 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం స్టార్స్ ఆ లక్ష్యాన్ని 12.1 ఓవర్లలోనే చేధించింది.  ఛేదనలో థామస్ రోజర్స్ (42; 34 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులు చేయగా.. మాక్స్‌వెల్ 15 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
 
ప్రస్తుతం స్టార్స్  7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా, రెనెగేడ్స్ 6 గేమ్‌లలో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.