ఇదెక్కడి న్యాయం సార్: గర్ల్ ఫ్రెండ్ ని కలిసేందుకు వెళ్లాలంటే యూఎస్ వీసా రిజెక్ట్ చేస్తారా..

ఇదెక్కడి న్యాయం సార్: గర్ల్ ఫ్రెండ్ ని కలిసేందుకు వెళ్లాలంటే యూఎస్ వీసా రిజెక్ట్ చేస్తారా..

యూఎస్ వీసా.. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో యూఎస్ వెళ్లాలనే ఆలోచన కూడా విరమిచుకున్నారు చాలామంది.. ఇక యూఎస్ వీసా పొందటం కూడా కష్టమయ్యిందని తెలుస్తోంది. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ క్రమంలో తన వీసా 40 సెకన్లలో రిజెక్ట్ చేశారంటూ ఓ నెటిజన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..

తాను B1 / B2 వీసా అప్లై చేస్తే.. ఒక్క నిమిషం కూడా వీసా ఇంటర్వ్యూ చేయకుండా 40 సెకన్లలోనే రిజెక్ట్ చేసారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదరు నెటిజన్. ఎంబసీ ఆఫీసర్ అడిగిన 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చానని.. అందుకు బదులుగా ఎటువంటి కారణం చెప్పకుండా 40 సెకన్లలోనే వీసా రిజెక్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నెటిజన్.

ఎంబసీ ఆఫీసర్ అడిగిన ప్రశ్నలు.. నెటిజన్ ఇచ్చిన సమాదానాలు:

  • మీరు యూఎస్ కి ఎందుకు వెళ్లాలనుకుంటారు.. ? అంటూ ఎంబసీ ఆఫీసర్ ప్రశ్నించగా 2 వారాల వెకేషన్ కోసం ఫ్లోరిడా వెళ్లాలని అనుకుంటున్నానంటూ సమాధానం ఇచ్చారు నెటిజన్.
  • గతంలో ఎప్పుడైనా ఇండియా వదిలి వెళ్ళారా? అన్న ప్రశ్నకు.. వెళ్ళలేదంటూ సమాధానం ఇచ్చారు నెటిజన్.
  • యూఎస్ లో మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉన్నారా అంటూ ఎంబసీ ఆఫీసర్ అడగగా.. తన గర్ల్ ఫ్రెండ్ ఫ్లోరిడాలో ఉంటోందని.. తనను కలిసేందుకు వెళ్తున్నానంటూ సమాధానం ఇచ్చారు నెటిజన్.

అంతే.. 3 ప్రశ్నల తర్వాత మీరు వీసాకు అర్హులు  కాదంటూ రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు నెటిజన్. తనకు ఇండియాలో స్టేబుల్ జాబ్ ఉండటం, ట్రావెల్ హిస్టరీ లేకపోవడం, ఫ్లోరిడాలో గర్ల్ ఫ్రెండ్ ని కలిసేందుకు ప్లాన్ చేయడం, రెండు వారాల తర్వాత తిరిగి ఇండియాకు రానుండటమే కారణమని ఎంబసీ ఆఫీసర్ పేర్కొన్నట్లు తెలిపాడు సదరు నెటిజన్.

కేవలం 40 సెకన్లలోనే తన వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యిందో అర్థం కావట్లేదంటూ పోస్ట్ చేశాడు నెటిజన్. కాగా... ఈ పోస్ట్ నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నంటూ నిజాయితిగా సమాధానం ఇవ్వడమే నువ్వు చేసిన తప్పంటూ కామెంట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఫ్లోరిడాలో గర్ల్ ఫ్రెండ్ ని కలిసాక నువ్వు అక్కడే అక్రమంగా స్థిరపడిపోతావేమో అన్న అనుమానంతో వీసా రిజెక్ట్ చేసి ఉండచ్చని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.