కొద్దిగా తగ్గిన మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ

కొద్దిగా తగ్గిన మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ

న్యూఢిల్లీ: కిందటి   నెలలో తయారీ రంగంలో ప్రొడక్షన్ 12 నెలల కనిష్టానికి పడిపోయింది. కొత్త ఆర్డర్లు రావడం తగ్గిందని  పీఎంఐ డేటాను విడుదల చేసే హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఇండియా పేర్కొంది. వ్యాపార పరిస్థితులు కిందటి నెలలో కొద్దిగానే మెరుగయ్యాయని తెలిపింది. 

మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్ నెలలో 56.4 గా నమోదైంది. అంతకు ముందు నెలలో రికార్డ్ అయిన 56.5 నుంచి కొద్దిగా తగ్గింది.  అయినప్పటికీ  దీర్ఘకాల సగటు 54.1 కంటే పైన నమోదైంది. పీఎంఐ  50 కి పైన రికార్డ్ అయితే సంబంధిత సెక్టార్‌‌‌‌‌‌‌‌ విస్తరిస్తున్నట్టు.