న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానాలు, వాణిజ్య చట్టాలను ఎదుర్కోవడానికి చైనా తీసుకుంటున్న చర్యల వల్ల ఈ సంవత్సరం మొదటి సగ భాగంలో భారతీయ మార్కెట్లు అస్థిరంగా ఉండవచ్చని మోతీలాల్ ఒస్వాల్ ప్రైవేట్ వెల్త్ (ఎంఓపీడబ్ల్యూ) తెలిపింది. ఇన్వెస్టర్లు హైబ్రిడ్ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ఎంచుకోవడం మేలని సూచించింది.
ఈక్విటీలతోపాటు గోల్డ్, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ ఇన్‌కమ్ పద్ధతుల్లో ఇన్వెస్ట్చేయాలని సలహా ఇచ్చింది. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్ షేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం రెండవ సగభాగంలో మార్కెట్ అస్థిరత తగ్గుతుందని అంచనా వేసింది. జీడీపీలో మందగమనం ఉన్నప్పటికీ, భారతదేశం వృద్ధి బాగానే ఉంటుందని ఎంఓపీడబ్ల్యూ పేర్కొంది.