
భువనేశ్వర్: పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంలో ఫెయిలైన ఇండియా మెన్స్ టీమ్‌కు.. ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో మరో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 1–4తో జర్మనీ చేతిలో ఓడింది. గుర్జాంత్ సింగ్ (13వ ని) ఇండియాకు ఏకైక గోల్ అందించగా, జర్మనీ తరఫున స్పెర్లింగ్ ఫ్లోరియన్ (7వ ని), ప్రింజ్ థీస్ (14వ ని), మైఖేల్(48వ ని), రాఫెల్ (55వ ని) గోల్స్ చేశారు.
ఇక విమెన్స్ ప్రోలీగ్ మ్యాచ్‌లోనూ ఆతిథ్య జట్టు నిరాశపరిచింది. ఇండియా 3–4తో స్పెయిన్ చేతిలో పోరాడి ఓడింది. బల్జీత్ కౌర్ (19వ ని), సాక్షి రాణా (38వ ని), రుతజా డాడ్సో పిసల్ (45వ ని) ఇండియాకు గోల్స్ అందించినా ఫలితం లేకపోయింది.