భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ గా మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్ సితాన్షి కోటక్ ఎంపికైనట్టు సమాచారం. జనవరి 22న ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే వైట్-బాల్ సిరీస్‌కు కోటక్ కొత్త బ్యాటింగ్ కోచ్‌గా భారత శిబిరంలో చేరనున్నారు. 52 ఏళ్ల కోటక్ 2019 నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత బీసీసీఐ బ్యాటింగ్ కోచ్ కోసం వెతుకుతున్నట్టు వార్తలు వచ్చాయి. సితాన్షి కోటక్ జట్టులో చేరనుండడంతో వచ్చిన వార్తలు నిజమని తెలుస్తుంది.
మాజీ ప్రధాన కోచ్ రాహు ద్రావిడ్ కోచింగ్ పదవి నుంచి తప్పుకున్నాక టీమిండియాకు సరైన బ్యాటింగ్ కోచ్ లేకుండా ఉన్నారు.గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ గా భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. బౌలింగ్ లో రాణిస్తున్నా బ్యాటింగ్ లో చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను 0-2 తేడాతో.. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 0-3 తేడాతో వైట్ వాష్ అయ్యారు. ఇటీవలే జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పేలవ బ్యాటింగ్ తో తీవ్ర నిరాశకు గురి చేసింది.
ALSO READ | BBL 2025: బిగ్ బాష్ లీగ్‌లో అగ్ని ప్రమాదం.. అభిమానులను తరలించిన పోలీసులు
ప్రస్తుతం భారత కోచింగ్ సిబ్బందిలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మోర్నే మోర్కెల్ (బౌలింగ్ కోచ్), అభిషేక్ నాయర్ (సహాయక కోచ్), ర్యాన్ టెన్ డోస్చాట్ (అసిస్టెంట్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు. వీరితో పాటు ఇంగ్లాండ్ సిరీస్ నుంచి భారత బ్యాటింగ్ కోచ్ గా సితాన్షి కోటక్ భారత జట్టులో చేరనున్నారు. టీమిండియా జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల కోసం ఇంగ్లాండ్ కు వెళ్లనుంది.
Shitanshu Kotak to join Team India as assistant batting coach: BCCI Source
— ANI Digital (@ani_digital) January 16, 2025
Read @ANI Story | https://t.co/AMscjkpdWb#ShitanshuKotak #TeamIndia #BCCI pic.twitter.com/NXFNSbyWeV