Kho Kho World Cup 2025: అదరగొట్టిన భారత పురుషుల జట్టు.. ఖోఖో ప్రపంచ విజేతగా మనమే

Kho Kho World Cup 2025: అదరగొట్టిన భారత పురుషుల జట్టు.. ఖోఖో ప్రపంచ విజేతగా మనమే

ఖోఖో తొలి ప్రపంచకప్ లోనే భారత్ తన సత్తా చాటింది. భారత్ పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్ నేపాల్ పై టీమిండియా గెలుపొంది తొలి కప్పును ముద్దాడింది. 54-36 తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు మహిళా జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీంను చిత్తు చేసి తొలి టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో మొత్తం 23 దేశాలు పాల్గొన్నాయి.

ఆదివారం (జనవరి 19) సాయంత్రం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నేపాల్‌ను ఓడించి భారత పురుషుల ఖో ఖో జట్టు తొలి ఖో ఖో ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రారంభంలో భారత మహిళల ఖో ఖో జట్టు అద్భుతమైన ఫైనల్‌లో నేపాల్‌పై ఆధిపత్యం చెలాయించింది. 78-- 40తో వారి విజయాన్ని ఖాయం చేసింది. మహిళల జట్టు ఖో ఖో ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Also Read : ఖోఖో ప్రపంచ కప్.. విజేతగా భారత మహిళజట్టు

భారత జాతీయ ఖో ఖో జట్లకు రాష్ట్రం స్పాన్సర్‌గా ఉన్నందున భారత మహిళల , పురుషుల జట్ల విజయాలు ఒడిశా ప్రజలలో ఆనందాన్ని తెచ్చాయి.  మూడేళ్ల స్పాన్సర్‌షిప్‌లో ఒడిశా ఏటా రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2027 స్పాన్సర్‌షిప్ వ్యవధి వరకు ఒడిషా రూ.15 కోట్ల స్పాన్సర్‌షిప్ ప్యాకేజీని అందిస్తుంది.