ఆసియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో..ఇండియాకు కాంస్యం

ఆసియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో..ఇండియాకు కాంస్యం

న్యూఢిల్లీ : ఆసియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. గురువారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో 0–3తో చైనీస్‌‌‌‌‌‌‌‌ తైపీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో మూడోసారి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తోనే టోర్నీని ముగించింది. 2021, 2023లోనూ ఇండియాకు కాంస్యం లభించింది. ఇక హోరాహోరీగా సాగిన తొలి సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఆచంట శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌ 7–11, 10–12, 9–11తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఏడో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ లిన్‌‌‌‌‌‌‌‌ యున్‌‌‌‌‌‌‌‌ జు చేతిలో కంగుతిన్నాడు. 

ఆరంభంలో మెరుగ్గా ఆడిన శరత్‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత గాడి తప్పాడు. కచ్చితంగా గెలవాల్సిన రెండో సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో మానవ్‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌ 11–9, 8–11, 11–13, 13–11తో కావో చెంగ్‌‌‌‌‌‌‌‌ జు చేతిలో పోరాడి ఓడాడు. మూడో సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో హర్మిత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ 6–11, 9–11, 7–11తో హుయాంగ్‌‌‌‌‌‌‌‌ యాన్‌‌‌‌‌‌‌‌ చెంగ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడటంతో ఇండియా కోలుకోలేకపోయింది. 

సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఓడినా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఆడిన తీరు చాలా బాగుందని టీటీ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ కితాబిచ్చింది. మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్లు మంచి పోరాట స్ఫూర్తిని చూపెట్టాయని కొనియాడింది.