20 రోజుల కిందట అదృశ్యం.. ఆల్మండ్ నదిలో శవమై కనిపించిన భారత విద్యార్థిని

20 రోజుల కిందట అదృశ్యం.. ఆల్మండ్ నదిలో శవమై కనిపించిన భారత విద్యార్థిని

స్కాట్లాండ్‌లో 20 రోజుల కిందట అదృశ్యమైన భారతీయ విద్యార్థిని సాండ్రా సాజు(22) శవమై కనిపించింది. ఎడిన్‌బర్గ్‌ నగరంలోని ఆల్మండ్ నదిలో ఆమె మృతదేహం లభ్యమైనట్లు స్కాట్లాండ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 

కేరళ, ఎర్నాకులంలోని పెరుంబవూరుకు చెందిన సాండ్రా గతేడాది పైచదువుల కోసం యూకే వెళ్లింది. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని హెరియట్-వాట్ యూనివర్సిటీలో ఆమె ఎంఎస్ చదువుతోంది. డిసెంబరు 6న రాత్రి 9:10 నుండి 9:45 గంటల సమయంలో ఎడిన్‌బర్గ్‌లోని గైల్ ప్రాంతంలో సాండ్రా ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఆమె చివరిసారిగా కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె నల్లటి ముఖానికి మాస్క్ ధరించి ఉంది.

సాండ్రా సాజు మరణానికి సంబంధించి స్కాట్లాండ్ పోలీసులు.. ఇప్పటికే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ALSO READ | మగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?