న్యూఢిల్లీ: అసెట్ మేనేజ్మెంట్సంస్థలు గత ఏడాది రూ.1.18 లక్షల కోట్లను సమీకరించాయి. ఇందుకోసం 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్ను (ఎన్ఎఫ్ఓలు) ప్రారంభించాయి. సెక్టోరల్ లేదా థీమాటిక్ ఈక్విటీ ఫండ్స్ నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయని జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. 2023లో ఇవి 212 ఎన్ఎఫ్ఓలతో రూ.63,854 కోట్లు, 2022లో 228 ఎన్ఎఫ్ఓలతో రూ.62,187 కోట్లు సేకరించాయి.
2020లో మొత్తం 81 ఎన్ఎఫ్ఓలు రాగా, 2024 వీటి సంఖ్య 239కి పెరిగింది. నిధులు 2020లో రూ.53,703 కోట్ల నుంచి రెట్టింపు అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఫండ్లపై ఇన్వెస్టర్ల నమ్మకం చెక్కుచెదరడం లేదని చెప్పవచ్చు. హెచ్డీఎఫ్సీ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ఎన్ఎఫ్ఓ గత ఏప్రిల్లో అత్యధికంగా రూ.12,500 కోట్ల ఇన్ఫ్లో సాధించింది.