కెనడాలో కత్తితో పొడిచి భారతీయుడి దారుణ హత్య..

కెనడాలో కత్తితో పొడిచి భారతీయుడి దారుణ హత్య..

కెనడాలో దారుణం జరిగింది. ఒట్టావా సమీపంలోని రాక్ ల్యాండ్ ఏరియాలో భారతీయుడిని దారుణంగా పొడిచి చంపారు దుండగులు. శనివారం (ఏప్రిల్ 5) ఉదయం ఈ దారుణ ఘటన జరిగినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది. 

ఈ ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు కెనడా పోలీసులు. ‘‘రాక్ ల్యాండ్ ఏరియాలో భారతీయుడి హత్య తీవ్రంగా బాధించింది. బాధితుల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటాం. మృతదేహాన్ని త్వరలోనే వారికి అప్పగిస్తామని, అందుకోసం వాళ్లకు సమాచారం అందించడం జరిగింది’’ అని ఇండియన్ ఎంబసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. 

అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. 

స్థానిక మీడియా ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, మరొకరు అరెస్ట్ అయ్యారని తెలిసింది. రాక్ ల్యాండ్ ప్రాంతంలో పోలీసుల నిఘా పెంచుతున్నట్లు ఒంటారియో పోలీసు అధికారులు తెలిపారు.