సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడానికి భారత నౌకాదళం తూర్పు తీరం వెంట పూర్వీ లెహర్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించింది.
ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నాయి. ఈ విన్యాసాలు బహుళ దశల్లో జరిగాయి. ఇందులో తూర్పు నౌకాదళంతోపాటు వాయుసేన, అండమాన్ కమాండ్, తీర రక్షణ దళం పాల్గొన్నాయి.