
ఇండియన్ నేవీ అగ్నిపథ్ స్కీం ద్వారా అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 2800 పోస్టులు ఉండగా ఇందులో స్త్రీలకు 560 పోస్టులు కేటాయించారు. ఇంటర్ పూర్తయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లో జులై 15 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం www.joinindiannavy.gov.in వెబ్సైట్ చూడాలి.