ఇండియన్ నేవీలో 2700 సెయిలర్ పోస్టులు

ఇండియన్ నేవీలో 2700 సెయిలర్ పోస్టులు

ఉరకలెత్తే ఉత్సాహం.. సముద్రమంత ఇష్టం ఉండి సగర్వంగా దేశ సేవ చేయాలనుకునే అవివాహిత యువకులకు ఆహ్వానం పలుకుతోంది ఇండియన్ నేవీ. ఒడిదొడుకులుండే సంద్రంలో నావల్ షిప్‌ ను సాఫీగా నడిపిస్తూనే సుస్థిర జీవితాన్ని లీడ్ చేసే ఆపర్చునిటీ కల్పిస్తోంది. ఇందుకుగాను 2700 సెయిలర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2020 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టుల్లో చేరొచ్చు.

ప్రారంభంలోనే ఐదంకెల జీతం, అన్ని రకాల అలవెన్సులు, ఏడాదికి వందకు పైగా సెలవులు, 50 లక్షల జీవిత బీమా, పిల్లలకు ఉచిత విద్య, గ్రాట్యుటీ, పెన్షన్ , ఉచిత మెడికల్ , ట్రావెల్ అలవెన్స్​ వంటి సదుపాయాలు కలిగిన సెయిలర్ జాబ్ అంటే యువతలో యమ క్రేజ్. ఇంటర్ ఎంపీసీతోనే కేంద్ర ప్రభుత్వ కొలువులో సుస్థిర భవితకు మార్గం సుగమం చేస్తున్న నేవీ సెయిలర్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ట్రైనింగ్ అండ్ సర్వీస్ నిబంధనలు, ప్రిపరేషన్ టిప్స్..

నోటిఫికేషన్

ఖాళీలు

ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్) 500

సీనియర్ సెకండరీ రిక్రూట్స్ 2200

మొత్తం 2700

అరత్హ : మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్టులుగా, కె-

మిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఆప్షనల్స్‌‌‌‌గా

కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/10+2

ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. నిర్ దేశిత

శారీరక ప్రమాణాలుం డాలి.

వయసు: 2000 ఫిబ్రవరి 1 నుం చి 2003 జనవరి

31 మధ్య జన్మించి ఉండాలి. అంటే 17 నుం చి 20

ఏళ్ల మధ్య ఉండాలి.

ఫీజు: రూ.205. ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 28

చివరి తేది: 2019 జూలై 10

వెబ్సైట్: www.joinindiannavy.gov.in

సెలెక్షన్ ప్రాసెస్: ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌‌‌‌లైన్ టెస్టులో మెరిట్ ద్వారా, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ కు స్టేట్‌‌‌‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌‌‌లైన్ టెస్టులో క్వాలిఫై అయిన 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. పీఎఫ్‌ టీలో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు . ఇందులో అనర్హత పొందిన వారు

21 రోజుల లోపు రూ.40 చెల్లించి మిలిటరీ హాస్పిటల్‌‌‌‌లో రివ్యూ కోరవచ్చు.

పరీక్షా విధానం: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నిర్వహించే ఈ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 60 నిమిషాలు. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీల్లో ప్రింట్ చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఒక రాం గ్ ఆన్సర్‌‌‌‌కు ¼ మార్కు మైనస్ అవుతుంది. సెక్షనల్ కటాఫ్‌ తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు పొందాలి.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు

ఇంగ్లిష్ 25 25

సైన్స్ 25 25

మ్యాథమెటిక్స్ 25 25

జనరల్ నాలెడ్జ్ 25 25

మొత్తం 100 100

ఫిజికల్ ఫిట్‌‌‌‌నెస్ టెస్ట్: పీఎఫ్‌ టీ గా పిలిచే ఈ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 20 సిట్‌‌‌‌అప్స్, 10 పుషప్స్ తీయాలి. క్రీడలు, స్విమ్మింగ్, ఇతర కర్రిక్యులర్ యాక్టివిటీస్‌‌‌‌లో సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

మెడికల్ స్టాం డర్స్డ్ తప్పనిసరి: కనీసం 157 సెం .మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు చాతీ 5 సెం .మీ. విస్తరించాలి. చెవులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. అద్దాలు ఉన్నా లేకున్నా కంటిచూపు 6/6 గా ఉండాలి. ముంజేతి లోపలి భాగంలో మాత్రమే టాట్టూ లు అనుమతిస్తారు. శరీరంలో ఏ ఇతర భాగంలో పచ్చ బొట్టు ఉన్నా వారు అనర్హులే.

ట్రెయినింగ్ : ఫిబ్రవరి 2020లో ప్రారంభమయ్యే ఈ బ్యాచ్‌ లో ఏఏ అభ్యర్థులకు 9 నెలలు, ఎస్ఎస్ఆర్ అభ్యర్థులకు 22 నెలల పాటు ఐఎన్ఎస్ చిల్కాకేంద్రం లో శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్‌‌‌‌లో నెలకు రూ . 14600 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెవెల్–3లో 20 సంవత్సరాల పాటు (ఎస్ఎస్ఆర్ కు 15 ఏళ్లు) సర్వీసులో నియమిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,700 ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకొని నెలకు 30 వేలకు పైగా వేతనాలు అందుతాయి. శిక్షణ కాలంలో బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వడంతో పాటు, ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. లెవెల్ 8 వరకు ప్రమోషన్ పొందితే నెలకు దాదాపు లక్ష రూపాయల వేతనం అందుతుంది. సెయిలర్లకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉంటుంది.