చైనా నావికుడిని కాపాడిన ఇండియన్ నేవీ

చైనా నావికుడిని కాపాడిన ఇండియన్ నేవీ

న్యూఢిల్లీ: తీవ్రంగా గాయపడిన ఓ చైనా నావికుడిని ఇండియన్​ నేవీ రక్షించింది. ప్రతికూల వాతావారణ పరిస్థితుల్లో ముంబైకి సుమారు 370 కిలో మీటర్ల దూరంలోని సరుకు రవాణా నౌక జాంగ్ షాన్ మెన్ నుంచి అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించింది. ముంబైలోని తమ మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌‌కు మంగళవారం రాత్రి చైనా సరుకు రవాణా నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చిందని ఇండియన్ నేవీ తెలిపింది.

తీవ్రంగా గాయపడిన 51 ఏండ్ల తమ నావికుడిని వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిందిగా అభ్యర్థన వచ్చిందని పేర్కొంది. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రతిస్పందించి.. బుధవారం ఉదయం 5.50 గంటలకు ఇండియన్ నేవీ ఎయిర్ స్టేషన్ షిక్రా నుంచి సీ కింగ్ హెలికాప్టర్‌‌ను పంపించింది. షిప్​బ్రిడ్జ్ వింగ్ నుంచి చైనా నావికుడిని ఎయిర్‌‌లిఫ్ట్ చేసి.. అక్కడి నుంచి ఎయిర్ స్టేషన్‌‌కు తరలించి అనంతరం ట్రీట్​మెంట్ ​కోసం ఆస్పత్రికి తరలించినట్టు ఇండియన్​ నేవీ ఎక్స్​లో పోస్ట్ చేసింది.