
రక్షణ రంగంలో చేరి దేశ సేవ చేయాలనుకునే పెండ్లికాని స్ర్తీ, పురుషులకు ఇండియన్ నేవీ ఆహ్వానం పలుకుతోంది. 2023 జనవరి (ఎస్‌టీ 23) కోర్సు వివిధ విభాగాల్లో 155 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. డిగ్రీతో ఎగ్జామ్ లేకుండానే ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ కొలువులో స్థిరపడేందుకు ఇదో మంచి అవకాశం.
ఎంట్రన్స్ టెస్ట్
వివిధ బ్రాంచుల్లో 144 షార్ట్ సర్వీస్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌ఈటీ) ఇది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు. సెలెక్టయితే 10+4 స్కీం కింద నేవీలో ఆఫీసర్ హోదాలో ప్రవేశించవచ్చు.
ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు కేరళలోని ఎజిమళలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియంటేషన్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తారు. కోర్సు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నవారిని ఇనిషియల్‌గా పదేళ్లపాటు షార్ట్‌సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్‌గా నియమిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతాలో ఇంటర్వ్యూ జరుగుతుంది. మర్చంట్ నేవీ అభ్యర్థులు సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లకు 3 సంవత్సరాలు, మిగిలిన వారికి రెండు సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 155
బ్రాంచిల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ – 93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ – 17, టెక్నికల్ బ్రాంచ్– 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్
విభాగాలు: జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
ఎడ్యుకేషన్ బ్రాంచ్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
టెక్నికల్ బ్రాంచ్
విభాగాలు: ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 2 జనవరి 1998 నుంచి -1 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్‌లిస్ట్ చేసి, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్స్ ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు అప్లై చేయాలి.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in