పనాజీ: గోవా కోస్ట్ ప్రాంతంలో ఇండియన్ నావల్ సబ్ మరైన్ను ఫిషింగ్ ఓడ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి ఆచూకీ కోసం సముద్రంలో గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఫిషింగ్ ఓడలో 13 మంది ఉన్నట్లు తెలిసింది. ఇండియన్ నేవీ గల్లంతైన ఇద్దరిని కాపాడేందుకు ముమ్మరంగా వెతుకులాట సాగిస్తోంది. ఆరు షిప్పులు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ సహాయక చర్యల్లో భాగమయ్యాయి.
మార్తోమా అనే ఫిషింగ్ ఓడ.. సబ్ మరైన్ను ఢీ కొట్టినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ముంబై(MRCC) తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదానికి కారణంపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపింది.
ALSO READ | డిజిటల్ అరెస్ట్ పేరుతో బిల్డర్ నుంచి కోటి కొట్టేసిన్రు