చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఓ నౌకాదళ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నవంబర్ 4న మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం, సౌత్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్ఎస్ గరుడ రన్‌వేపై రన్‌వేపై ఉండగా హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌లు తగలడంతో నౌకాదళ అధికారి ఈ ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారు ప్రస్తుతం నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఉన్న సంజీవని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రామాణిక శిక్షణా కార్యక్రమంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై భారత నౌకాదళం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై స్పందించిన కొచ్చి హార్బర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ALSO READ :- కేసీఆర్ సీఎం పదవి నుంచి వెంటనే తప్పుకోవాలె : కిషన్ రెడ్డి