సీ గార్డియన్ MQ-9B నిఘాడ్రోన్లో టెక్నికల్ ప్రాబ్లమ్..బంగాళాఖాతంలో కూలిపోయింది

సీ గార్డియన్ MQ-9B నిఘాడ్రోన్లో టెక్నికల్ ప్రాబ్లమ్..బంగాళాఖాతంలో కూలిపోయింది

భారత నావికా దళానికి చెందిన సీ గార్డియన్ డ్రోన్ MQ-9B సాంకేతికలోపంతో బంగాళా ఖాతంలో కూలింది. అధిక ఎత్తు, ఎక్కువ దూరంలో ఉన్న శత్రువులను ఈజీగా పసిగట్టగల ఈ హైఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ (HLA RPA) సీ గార్డియన్ డ్రోన్ ను అమెరికానుంచి భారత నావికా దళం లీజుకు తీసుకుంది. 

ఈ డ్రోన్ దీనిని భారత నేవీ చెన్నై సమీపంలో లోని అరక్కోణం లోని ఐఎన్ ఎస్ రాజౌలి నుంచి అపరేట్ చేస్తోంది. బుధవారం  మధ్యాహ్నం 2గంటలకు MQ-9B సీ గార్డియన్ డ్రోన్ లో  టెక్నికల్ సమస్యలో బంగాళాఖాతంలో కూలిపోయిందని ఇండియన్ నేవీ అధికారులు చెప్పారు.  

2020లో భారత నావికా దళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం యూఎస్ ఆధారిత రక్షణ సంస్థ జనరల్ అటామిక్స్ నుంచి రెండు MQ-9B సీ గార్డియన్ డ్రోన్ లను లీజుకు తీసుకుంది. వాస్తవానికి ఒక సంవత్సరం పాటు లీజు ఒప్పందం జరిగినప్పటికీ దానిని కొనసాగించారు. లీజు ఒప్పందం ప్రకారం కోల్పోయిన డ్రోన్ ను మరొకదానితో భర్తీ చేయాల్సి ఉంటుంది. 

మరోవైపు 3బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో 31 MQ-9B ప్రిడేటర్ నిఘా డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ యోచిస్తోంది. 2023 జూన్ లో యునైటెడ్ స్టేట్స్ నుంచి MQ9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ఆర్మీ నిఘా సామర్థ్యాలను ముఖ్యంగా చైనా సరిహద్దు వెంబడి పెంచే లక్ష్యంతో ఈ నిఘా డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమవుతోంది.