కడెం, వెలుగు: అయిల్ పామ్ పంటకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, భారతీయ ఆయిల్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కాళిదాసు అన్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ క్లస్టర్ ఆయిల్ పామ్ రైతుల సమావేశం నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు.
ఆయిల్ పామ్ పంట సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, ముస్కు రాజేందర్ రెడ్డి, పడిగల భూషణ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ సర్కార్
ఖానాపూర్, వెలుగు: అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తోందని బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఅర్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఖానాపూర్ మండలం సుర్జాపూర్, బాదనకుర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
మండలంలోని సత్తనపల్లిలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వేను అయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు