నేటి నుంచి ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ గెలుచుకోవటమే లక్ష్యంగా స్టార్ ప్లేయర్లు సింధు, శ్రీకాంత్ రెడీ అవుతున్నారు. మంగళవారం ప్రారంభమయ్యే 350,000 అమెరిక-న్ డాలర్ల ప్రైజ్ మనీ గల ఈ మెగా ఈవెంట్ కు గాయంకారణంగా సైనా నెహ్వల్ తో పాటు పులువురు ఇంటర్నేషనల్ ప్లేయర్లు దూరమయ్యారు. అనారోగ్యం కారణంగా ఇటీవల స్విస్ ఓపెన్ నుంచి తపుపకున్న సైనా ఈ టోరీన్లోనూ ఆడటం లేదు. దీంతో స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియాను గెలిపించే బాధ్యత సింధు, శ్రీకాంత్ లపైనే ఉంది. డిసెంబర్ లో జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రజతం గెలుచుకున్న ఒలింపిక్ రజత పతక విజేత సింధు ఈ టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. చైనా టాప్ స్పీడ్ ప్లేయర్ , ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ చెన్ యు ఫి అనారోగ్యం తో ఈ టోర్నీ నుంచి తపుపకోవటంతో సింధు టైటిల్ ఆశలు మరింత మెరుగయాయ్యి. పలువురు జపాన్ ప్లేయర్లు కూడా ఈ టోర్నమెంట్ కు దూరమవడంతో సింధుకు మరింత అనుకూలంగా మారింది. ఈ ఏడాది పలు టోర్నీల్లో ఆశాజనకమైన ఆటను కనబరిచినప్పటికీ ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్ లో తొలి రౌండ్ లోనే ఓటమి పాలై నిరాశపరిచింది. 2017లో ఇండియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సింధు ఆ తర్వాత రెండేళ్లూ ఫైనల్స్ దాకా చేరుకుంది.ఈ ఏడాది తొలి మ్యాచ్ లో భారత్ కే చెందిన ముగ్ధ ఆగ్రేతో పోటీపడనున్న సింధు క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ డెన్మార్క్ ప్లేయర్ మియా బ్లిచ్ ఫెల్డ్ తోపోటీ ఎదురయ్యే ఛాన్సుంది. ఇక మెన్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ షి యు కి టోర్నీ నుంచి తప్పు కోవటంతో ఇండియన్ స్టార్ శ్రీకాంత్ హాట్ ఫేవరెట్ అయ్యాడు. అయితే హాట్ ఫేవరెట్ విక్టర్ ఆక్లెస్ సెన్ నుంచి శ్రీకాంత్ కు గట్టి పోటీ ఎదురవ్వొచ్చు. శ్రీకాంత్ తొలి మ్యాచ్ ను వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్ )తో ఆడతాడు. మిగతా భారత ఆటగాళ్లు సమీర్ వరమ్, సాయి పర్ణీత్ , గురుసాయిదత్ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.