అమెరికాలో జరిగే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో.. భారతీయ సంతతి, తెలంగాణ మూలాలున్న 12 ఏళ్ల బృహత్ సోమా సత్తా చాడాడు. ఫ్లోరిడాకు చెందిన ఈ విద్యార్థి.. టైబ్రేకర్ రౌండ్ లో 29 పదాలను కేవలం 90 సెకంన్లలో పలికి ఈ ఏడాది స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో 50 వేల డాలర్ల (రూ.41.64లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు సోమా, టైటిట్ ప్రసంశా పత్రాన్ని అందుకున్నాడు. బృహత్ 29 పదాలను కేవలం 90 సెకన్లలో పలికేశాడు. అంతకుముందు బృహత్ 2022లో 163వ ర్యాంక్, 2023లో 74వ ర్యాంక్ లో నిలిచాడు.
బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమా.. తెలంగాణలోకి నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. వారు ఫ్లొరిడాలో స్థిరపడ్డారు. అమెరికాలో జరిగే ఈ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో కొన్నాళ్లుగా భారతీయ సంతతి విద్యార్థులు హవా కొనసాగిస్తున్నారు. ఫైనల్ రౌండ్ లోకి 9మంది రాగా.. అందులో నలుగురు భారతీయ మూలలు ఉన్న విద్యార్థులే ఉన్నరంటే అర్థం చేసుకోవచ్చు మనోళ్లు అక్కడ ఎంత కాంపిటీషన్ ఇస్తు్న్నారో అని.