హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన విద్యార్థిగా భారతీయ సంతతికి చెందిన 12 ఏళ్ల బాలుడు సుబోర్నో ఐజాక్ బారి చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, వచ్చే వారం లాంగ్ ఐలాండ్ హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ చేసిన అతి పిన్న వయస్కుడైన విద్యార్థి సుబోర్నో బారీ అవుతాడు. న్యూయార్క్‌లోని మాల్వెర్నే హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ (NYU)లో గణితం, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించనున్నాడు. అక్కడ అతను పూర్తి స్కాలర్‌షిప్ పొందాడు.
సుబోర్నో ఐజాక్ తన విజయాల గురించి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. 12 సంవత్సరాల వయస్సులో, నేను మాల్వెర్న్ హై స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాను. వచ్చే నెల నా గ్రాడ్యుయేషన్ పూర్తి కానుంది. నేను 12 సంవత్సరాల వయస్సులో హైస్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొదటి అమెరికన్ ( భారత ఉపఖండం నుండి) అవుతాను " అని సుబోర్నో ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. సుబోర్నో ఐజాక్ బారీ రెండు పుస్తకాలు రాశారు, ఇండియన్ యూనివర్సిటీలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. తన లక్ష్యం ప్రొఫెసర్‌గా ఉండటం, అవసరమైన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం అని చెప్పారు సుబోర్నో.