ఒట్టావా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన బిల్డర్‌తో పాటు మరొకరు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో గల కవానాగ్ పరిసరాల్లో ఓ బిల్డింగ్ నిర్మాణ స్థలంలో సోమవారం పట్టపగలు ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
కాగా, అక్కడ 49 ఏండ్లు, 57 ఏండ్ల వయసు కలిగిన ఇద్దరు వ్యక్తులు బుల్లెట్‌గాయాలతో చనిపోయారని, మరో 51 ఏండ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతన్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో మరణించిన వ్యక్తిని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమాని బూటా సింగ్ గిల్‌గా గుర్తించారు. మృతిచెందిన మరో వ్యక్తితో పాటు తీవ్రంగా గాయపడిన వ్యక్తుల వివరాలు మాత్రం తెలియరాలేదు.