గతేడాది లండన్‌లో తన భార్యను కత్తితో పొడిచి చంపినట్లు భారత సంతతికి చెందిన సాహిల్ శర్మ నేరాన్ని అంగీకరించాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన తన భార్య మెహక్ శర్మను తానే హత్య చేసినట్లు సాహిల్ శర్మ 999 కి ఫోన్ చేసి పోలీసులకు నిజం చెప్పాడు. 2023న అక్టోబరు 29న తన భార్యను తన ఇంటిలో కత్తితో పొడిచి చంపినట్లు శర్మ పోలీసులకు చెప్పాడు. కింగ్‌స్టన్ క్రౌన్ కోర్టు అతడిని కస్టడీకి అప్పగించింది. సాహిల్ శర్మకు ఏప్రిల్ 26న అదే కోర్టులో శిక్ష విధించనున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
ALSO READ :- మొదటిరోజు అలా.. రెండో రోజు ఎలా.. పెరుగుతున్న ఈగల్ కలెక్షన్స్
2023 అక్టోబర్ 31న ప్రత్యేక పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం శర్మ భార్య మెహక్ మెడపై కత్తిపోట్ల వల్ల చనిపోయినట్లు తేలింది. మెహక్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం 2023 డిసెంబర్ లో పంజాబ్ లోని ఆమె స్వస్థలమైన జోగి చీమా గ్రామానికి తరలించారు. అయితే లండన్ లో తన కుమార్తెను తన అల్లుడు సాహిల్ శర్మ వేధించాడని..బెదిరించాడని మెహక్ తల్లి ఆరోపించింది.