ఫ్రీఫుడ్ వీడియో షేర్ చేశాడని..ఉద్యోగం నుంచి తీసేశారు

సోషల్ మీడియాలో షేరింగ్ అనేది చాలా అనేక విషయాలు తెలియజేస్తుంది..కంటెంట్, ఫొటోలు, వీడియోలను షేరింగ్ చేయడం ద్వారా యూజర్లు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు నాలెడ్జ్ కూడా వస్తుంది.తమ అభిప్రాయాలను తెలిపేందుకు సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుందని మనకు తెలిసిన విషయమే.. కానీ ఇటీవల కాలంలో కొందరు యూజర్లు షేర్ చేస్తున్న పోస్టుల వల్ల తమ కెరీర్ ను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు ఉదాహరణ..కెనడాలో పని చేస్తున్న ఇండియన్ సంతతికి చెందిన ఓ ఉద్యోగి Xలో షేర్ చేసిన వీడియో.. తన జాబ్ కు ఎసరు పెట్టింది. అతను పొగుడుతూ వీడియో షేర్ చేసినా..ఆ పోస్ట్ అక్కడి నిబంధనలకు విరుద్ధం అని అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. వివరాల్లోకి వెళితే.. 

కెనడాలో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న మొహల్ ప్రజాపతి అనే ఇండియన్ ఆరిజిన్.. X  ప్లాట్ ఫాంలో అక్కడి ఓ సేవసంస్థకు సంబంధించి పోస్టును షేర్ చేశాడు. ఈ సేవా సంస్థ.. కెనడాలోని విద్యార్థులకోసం ఫుడ్ బ్యాంకు ద్వారా ఉచితంగా ఆహారం అందిస్తోంది.  TD కంపెనీలో డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్న ప్రజాపతి.. రోజూ అక్కడి వెళ్లి ఆహారం తీసుకునేవాడు. ఈ క్రమంలో సంస్థ మంచి ఫుడ్ అందిస్తోంది. నేను నెలకు ఆహారానికి అవసరమయ్యే ఖర్చును ఆదా చేస్తున్నాను అని వివరిస్తూ వీడియో పోస్ట్ చేశాడు. 

ఎలాంటి లాభం లేకుండా సేవాసంస్థలు, చర్చిలు, ట్రస్టులు.. కాలేజీ, యూనివర్సిటీల్లో ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా కిరాణా అందిస్తున్నారని చెప్పాడు. మొహల్ ప్రజాపతి షేర్ చేసిన వీడియోలో వారానికి సరిపడా ఆహారాన్ని తాను తీసుకున్నట్లు చూపించాడు. ఇందులో పండ్లు, కూరగాయాలు, బ్రెడ్, సాస్, పాస్తా, క్యాన్డ్ వెడిటేబుల్స్ ఉన్నాయి. 

అయితే మొహల్ ప్రజాపతి షేర్ చేసిన ఈ పోస్ట్ అతని ఉద్యోగానికి ముప్పు తెచ్చింది. మొహల్ ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్న TD  కంపెనీ ఈమెయిల్ పంపించింది. అయితే మొహల్ షేర్ చేసిన వీడియో, ఉద్యోగం తొలగింపు సోషల్ మీడియాలో  చర్చకు దారితీసింది. 

కొందరు నెటిజన్లు మొహల్ ప్రజాపతిని సమర్థిస్తే కొందరు విమర్శించారు. అవసరంలో ఉన్న వారికోసం ఉద్దేశించినవి ఈ ఫుడ్ బ్యాంకులు.  డబ్బులు ఆదా చేసేందుకు ఫ్రీ ఫుడ్ బ్యాంకులకు వెళ్తాడా అని స్పందించారు. మరొ నెటిజన్ రాస్తూ..‘‘ కెనడా నిబంధనలకు విరుద్ధంగా అతను అలాంటి వీడియోలు షేర్ చేయడం పొరపాటే అయినా..ఉద్యోగం పోయింది ఏమి చేస్తాడు’’ అని సమర్దించాడు.