- నార్త్ కరోలినాలో ఘటన
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఓ టీనేజర్ హత్య చేశాడు. నార్త్ కరోలినా రాష్ట్రంలో 2580 ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో మైనాంక్ పటేల్ (36) టొబాకో హౌస్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గత మంగళవారం మధ్యాహ్నం ఓ టీనేజీ బాలుడు స్టోర్‌కు వచ్చి, దొంగతనం చేయడంతో పటేల్ అడ్డుకున్నాడు. దీంతో ఆ బాలుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పటేల్‌ను షూట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పటేల్‌ను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం టీనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటేల్‌కు భార్య అమీ, ఐదేండ్ల కుమార్తె ఉన్నారు. భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని పోలీసులు వెల్లడించారు.