రెండు రోజుల్లో రుణమాఫీ డబ్బులు : మంత్రి జూపల్లి కృష్ణారావు

రెండు రోజుల్లో రుణమాఫీ డబ్బులు : మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, వెలుగు : వీపనగండ్ల ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​లో కొందరు రైతులకు రుణమాఫీ డబ్బులు కాలేదని, రెండు, మూడు రోజుల్లో ఖాతాల్లో జమ​అవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటి, రెండు విడతల్లో రైతులకు రుణమాఫీ అయినప్పటికీ, కొన్ని గ్రామాల రైతులు తమకు మాఫీ డబ్బులు జమ కాలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రెండు రోజుల కింద మంత్రి వీపనగండ్ల బ్యాంకు మేనేజర్  రవీంద్రబాబుతో మాట్లాడగా, సాంకేతిక సమస్య కారణంగా చిన్నంబావి, వీపనగండ్ల రైతులకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​లో రీజినల్  మేనేజర్, అగ్రికల్చర్  ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు.