Good News: మొబైల్ ఉంటే చాలు.. ఇంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు..!

Good News: మొబైల్ ఉంటే చాలు.. ఇంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు..!

గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే యుద్ధమే చేయాల్సి వచ్చేది. బ్యాంక్‎కు వెళ్లి క్యూలో నిలబడి ఫామ్స్ నింపి అప్లికేషన్ పెట్టుకున్నాక.. ఓ రెండు, మూడు రోజుల తర్వాత మన పేరు మీద అకౌంట్ ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడలా కాదు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇంట్లో కూర్చొనే ఏ పని అయిన క్షణాల్లోనే చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కావాల్సిన ఫుడ్, కావాల్సిన వస్తువులు ఇంట్లో కూర్చొనే నిమిషాల్లోనే ఆర్డర్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. 

Also Read :- ఏటీఎం కార్డ్ సైజులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్..!

ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా టెక్నాలజీ మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్న, మనీ ట్రాన్స్‎ఫర్ చేయాలన్న, లోన్ అప్లై చేసుకోవాలన్న బ్యాంక్‎కు వెళ్లకుండానే నిమిషాల్లోనే మనం ఉన్న దగ్గరే చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా వినియోగాదారుల కోసం ఇలాంటి సదుపాయాన్నే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టా డిజిటల్ సేవింగ్స్ ఖాతా పేరుతో ఆన్ లైన్‎లోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని విధానాన్ని తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే బ్యాంక్‎కు వెళ్లకుండానే ఆన్ లైన్‎లో సేవింగ్స్ అకౌంట్‎ను ఓపెన్ చేసుకోవచ్చు. 

ఆన్ లైన్‎లో IOB సేవింగ్స్ అకౌంట్ చేయడానికి అర్హతలు:

  • చెల్లుబాటు అయ్యే ఆధార్, పాన్ కార్డు ఉండాలి
  • ఆధార్ కార్డు, పాన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి
  • వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
  • కస్టమర్లు మరే ఇతర బ్యాంకులో ఆన్ లైన్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండరాదు.
  • కస్టమర్లు ఒకే ఒక ఇన్‌స్టా డిజిటల్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి

ఖాతా ఎలా ఓపెన్ చేయాలంటే..?

ఇంటర్ నెట్‎లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వైబ్ సైట్‎ను సంప్రందించాలి. అక్కడ ఇన్‌స్టా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‎పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం ఆధార్ కార్డ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‎కు ఓటీపి వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు పైన ఇండియన్ ఓవర్సీస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతోంది. 

  • ఈ అకౌంట్ వ్యవధి గరిష్టంగా ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. 
  • ఈ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్‎కు కూడా ఫీజులు, ఛార్జీలు వర్తిస్తాయి.
  • ప్రతి లావాదేవీకి లావాదేవీ పరిమితి రూ.49,999 ఉంటుంది. 
  • బ్యాంకుల్లో నగదు ఉపసంహరణకు అనుమతి ఉండదు. 
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, IMPS, UPI లావాదేవీలు సౌకర్యాలు ఉంటాయి.
  • వినియోగదారులు రూపే క్లాసిక్/ ప్లాటినం డెబిట్ కార్డును పొందుతారు.